Karunanidhi: మెరీనా బీచ్ లో కుదరదు... కరుణ అంత్యక్రియలపై సిద్ధమైన ప్రభుత్వ అఫిడవిట్!

  • చాలా కారణాలు అడ్డు వస్తున్నాయి
  • ప్రత్యామ్నాయంగా రెండు ఎకరాలు ఇస్తాం
  • కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్న సర్కారు

దివంగత నేత కరుణానిధి అంత్యక్రియలను చెన్నై మెరీనా బీచ్ లో జరిపేందుకు పలు కారణాలు అడ్డుగా ఉన్నాయని పళనిస్వామి ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది. మరికాసేపట్లో హైకోర్టు న్యాయమూర్తి ముందు ప్రభుత్వం తన సమాధానాన్ని తెలియజేయనుంది. సముద్ర తీరం నుంచి 500 మీటర్ల దూరం వరకూ ఏ విధమైన నిర్మాణాలు వద్దని గతంలో కోర్టు చెప్పినట్టు ఈ అఫిడవిట్ లో ప్రభుత్వం ప్రస్తావించింది.

మెరీనా బీచ్ లో స్థలాన్ని కేటాయించలేక పోతున్నామని, దీనికి ప్రత్యామ్నాయంగా గిండిలో రెండు ఎకరాల స్థలం కేటాయించామని పేర్కొంది. కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులతో పోలిస్తే, ఇప్పటి పరిస్థితులు వేరని, పర్యావరణ సమస్యలు ఎన్నో ఉన్నాయని చెప్పింది. మెరీనా బీచ్ లో నిర్మాణాలపై హైకోర్టులో పలు కేసులు విచారణ దశలో ఉన్నాయని గుర్తు చేయనుంది.  

  • Loading...

More Telugu News