imran khan: పాక్ అభిమాని కన్ ఫ్యూజ్.. నటుడు ఇమ్రాన్ ఖాన్ కు శుభాకాంక్షలు!
- పొరబడ్డ పాకిస్తాన్ అభిమాని
- ఫన్నీగా రిప్లై ఇచ్చిన ఇమ్రాన్
- ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నటుడు
ఫోన్ లో ఒకే పేరుతో రెండు నంబర్లు ఉన్నప్పుడు మనం ఒక్కోసారి కన్ ఫ్యూజ్ అయిపోయి ఒకరికి బదులుగా మరొకరికి కాల్ చేస్తుంటాం. కొన్నిసార్లు పొరపాటున మెసేజ్ లు పంపించేస్తుంటాం. ఇలా తప్పుడు కాల్స్, మెసేజ్ లు అందుకునే కొందరు చికాకు పడిపోతే.. మరికొందరు మాత్రం సరదాగా స్పందిస్తారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ఈ కోవలోని వాడే.
అసలు విషయం ఏంటంటే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ త్వరలో ఆ దేశపు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ అభిమాని ఒకరు.. ఆయనకు ఇన్ స్టాగ్రామ్ లో శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. సదరు అభిమాని తన సందేశాన్ని పాక్ ఇమ్రాన్ ఖాన్ కు పంపకుండా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ కు పంపేశాడు. అయితే దీనికి విసుక్కోని ఇమ్రాన్ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.
ఆ వ్యక్తి తన సందేశంలో ‘ప్రియమైన ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారికి.. విజయవంతమైన నాయకుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు. తన నిజమైన స్నేహితులు, మద్దతుదారుల్ని గుర్తిస్తాడు. మీ ప్రభుత్వంలో తొలిరోజే నేను భాగస్వామిని కావాలనుకుంటున్నాను’ అని ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఇన్ స్టాగ్రామ్ లో పంపాడు.
దీనికి మన ఇమ్రాన్ అంతే ఫన్నీగా స్పందిస్తూ.. ‘నేను ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదని అనుకుంటున్నాను. ఈ వారంలోనే ప్రభుత్వ విధివిధానాలపై డ్రాఫ్ట్ ను తయారుచేస్తాను. దీనికి సంబంధించిన అన్ని వివరాలను మీకు అప్ డేట్ చేస్తుంటాను’ అంటూ సీరియస్ జవాబిచ్చేశాడు. ఈ క్లిప్ ను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఇమ్రాన్ పోస్ట్ చేశారు.

A post shared by Imran Khan (@imrankhan) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2018-08-07T08:49:22+00:00">Aug 7, 2018 at 1:49am PDT</time>