america: అమెరికా కాంగ్రెస్ లో అడుగుపెట్టనున్న తొలి ముస్లిం మహిళ
- పాలస్తీనా సంతతికి చెందిన రషీదా తలైబ్
- మిషిగన్ లో ‘డెమోక్రాటిక్’ నామినేషన్ గెలిచిన రషీదా
- నవంబరులో జరగనున్న ఎన్నికలు
- బరిలో నిలవని ‘రిపబ్లికన్’ అభ్యర్థులు
అమెరికా కాంగ్రెస్ లోకి అడుగుపెట్టనున్న తొలి ముస్లిం మహిళగా రషీదా తలైబ్ చరిత్ర సృష్టించనున్నారు. మిషిగన్ లోని 13వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ లో డెమోక్రాటిక్ పార్టీ నామినేషన్ ను ఆమె గెలుచుకుంది. బ్రెండా జోన్స్ పై పోటీ చేసి ఈ నామినేషన్ ను రషీదా గెలుచుకున్నారు. నవంబరులో ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన అభ్యర్థులెవ్వరూ ఎన్నికల బరిలో లేకపోవడంతో రషీదా విజయం ఖాయమైంది.
కాగా, రషీదా తలైబ్ పాలస్తీనా సంతతికి చెందిన మహిళ. రాజకీయాల్లోకి రాకముందు ఆమె న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా పని చేశారు. నాడు మిషిగన్ రాష్ట్ర శాసనకర్తగా అడుగుపెట్టిన తొలి ముస్లిం మహిళ గానూ రషీదా రికార్డు సృష్టించారు. 2009 -2014 వరకు మిషిగన్ రాష్ట్ర శాసనకర్తగా ఆమె పని చేశారు.