India: చెప్పుకోడానికి ఏమీ లేదు... మేమేమీ గర్వపడే పని చేయలేదు: విరాట్ కోహ్లీ

  • ఇటీవలి మ్యాచ్ లలో ఇదే ఘోర వైఫల్యం
  • ఇంగ్లండ్ ఆటగాళ్లు విజయానికి అర్హులే
  • ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ వ్యాఖ్య

"మా ఆటతీరును చూసి మేమేమీ గర్వపడటం లేదు. నిజాయతీగా చెప్పాలంటే, విదేశాల్లో ఇటీవల మేము ఆడిన అన్ని టెస్టు మ్యాచ్ లలో ఇదే అత్యంత ఘోరవైఫల్యం. అయితే, ఈ క్రెడిట్ అంతా ఇంగ్లండ్ కు దక్కుతుంది. వారు ఆడిన తీరుతో విజయానికి అర్హులనిపించుకున్నారు. మేము మా ఆటతీరుతో పరాజయాన్ని చవిచూశాం" అని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

లార్డ్స్ లో జరిగిన స్పెక్ సేవర్స్ రెండో టెస్టులో ఘోర ఓటమిని కోహ్లీ సేన మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. తమ ఓటమికి లార్డ్స్ లోని వాతావరణ పరిస్థితే కారణమని నిందించాలని తానేమీ అనుకోవడం లేదని, తుది జట్టును ప్రకటించే సమయానికి అదనపు సీమర్ అవసరం లేదని భావించామని మరో ప్రశ్నకు సమాధానంగా కోహ్లీ వెల్లడించాడు.

కాగా, ఐదు రోజుల మ్యాచ్ లో వర్షం కారణంగా సుమారు రెండు రోజుల మ్యాచ్ వర్షార్పణం కాగా, రెండు రోజుల ఆటలోనే ఇంగ్లండ్ బౌలర్లు ఇండియాను రెండుసార్లు ఆలౌట్ చేసి 2-0తో సిరీస్ లో ముందుకెళ్లారు.

  • Loading...

More Telugu News