bhadrachalam: భ్రదాచలం వద్ద పోటెత్తుతున్న గోదావరి.. పోలవరం వద్ద భారీ వరద
- 32.5 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం
- నీట మునిగిన స్నానఘట్టాలు
- ఆందోళనలో లోతట్టు ప్రాంత ప్రజలు
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్న 32.5 అడుగులుగా ఉన్న నీటి మట్టం ఈ ఉదయం 9 గంటలకు 34.5 అడుగులకు చేరింది. దీంతో, ఆలయం వద్ద ఉన్న స్నానఘట్టాలు నీట మునిగాయి.
గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ క్షణంలోనైనా వరద నీరు ఇళ్లలోకి చేరే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి పోటెత్తుతుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో, ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఆటంకం కలిగింది.