jaipal reddy: విమానాశ్రయంలోకి జైపాల్ రెడ్డిని అనుమతించని పోలీసులు!
- కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్న రాహుల్
- స్వాగతం పలికేందుకు 12 మందికి మాత్రమే అనుమతి
- జాబితాలో పేరు లేకపోవడంతో.. జైపాల్ ను బయటే ఆపివేసిన పోలీసులు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆయనను పోలీసులు అనుమతించలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో, ఆయనకు స్వాగతం పలికేందుకు జైపాల్ విమానాశ్రయానికి వెళ్లారు.
అయితే, రాహుల్ కు స్వాగతం పలికేవారి పేర్లతో పీసీసీ తయారు చేసిన జాబితాలో మీ పేరు లేదంటూ జైపాల్ ను విమానాశ్రయంలోకి అనుమతించలేదు. జానారెడ్డిని లోపలకు పంపి, జైపాల్ ను బయటే నిలిపివేశారు. రాహుల్ కు స్వాగతం పలికేందుకు కేవలం 12 మందికి మాత్రమే అనుమతి ఉంది. కాసేపట్లో బీదర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాహుల్ చేరుకోనున్నారు.