karuna: నన్ను అవమాన పరిచిన దర్శకుడు మళ్లీ అడ్రెస్ లేడు: యాంకర్ కరుణ భూషణ్
- నాకు తెలుగు తెలియదు
- కొన్ని పదాలు పలకడం వచ్చేది కాదు
- ఆ విషయం నేను ముందుగానే చెప్పాను
యాంకర్ గాను .. బుల్లితెర నటిగాను కరుణ భూషణ్ కి మంచి క్రేజ్ వుంది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తన కెరియర్ ను గురించి ప్రస్తావించింది. " అప్పుడు నేను 'విహారి' కార్యక్రమం చేస్తున్నాను .. నాకు తెలుగు అసలే రాదు. నాకు తెలుగు తెలియదు .. స్క్రిప్ట్ చూసుకుని చెప్పగలుగుతాను అని ఆ ప్రోగ్రామ్ నిర్మాతకి నేను ముందుగానే చెప్పాను. నేను యాంకరింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ .. ఇంతకు ముందు ఎక్కడా చేయలేదని కూడా అన్నాను.
ఆ కార్యక్రమం కోసం ఒక ప్లేస్ కి వెళ్లాక ఆ దర్శకుడు నాకు క్లాస్ తీసుకోవడం మొదలుపెట్టాడు. " నీకు తెలుగు రాదు .. యాంకరింగ్ తెలియదు .. నువ్వేమైనా స్టార్ నని అనుకుంటున్నావా?" అంటూ నానా మాటలు అన్నాడు. నాకు తెలుగు తెలియదనీ .. కొన్ని పదాలు పలకలేనని నేను ముందే చెప్పాను. అలాంటిది కష్టమైన పదాలతో కూడిన స్క్రిప్ట్ ను ప్రామ్టింగ్ లేకుండా చెప్పమంటే ఎలా? అని అడిగాను. ఒకవేళ నేను పనికిరానని అనుకుంటే తప్పించేయండి అన్నాను. అలాంటి నేను అప్పటి నుంచి ఇదే ఫీల్డ్ లో కొనసాగుతున్నాను .. అది నేను గర్వంగా భావిస్తున్నాను. ఆ దర్శకుడు మాత్రం అప్పటి నుంచి మళ్లీ నాకు ఎక్కడా కనిపించలేదు. నా టాలెంట్ తో నేను ఆయనకి సమాధానం చెప్పాననే అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది.