New Delhi: ఆగస్టు 15 వేడుకల్లో పాటపాడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్!

  • అమెరికా పౌర హక్కుల ఉద్యమం పాట
  • హమ్ హోంగే కామ్యాబ్.. పాటపాడిన సీఎం
  • హిందీలోకి అనువదించిన ప్రముఖ కవి గిరిజ కుమార్

ఢిల్లీలోని చత్రాసాల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాట పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఉదయం జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన ‘హమ్ హోంగే కామ్యాబ్..’ (అవరోధాల్ని అధిగమించాలి) అనే పాటను పాడి వినిపించారు.

కేజ్రీవాల్‌కు పాటలు పాడడం ఇదేమీ కొత్తకాదు. 2013లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక కూడా ఓ పాట పాడారు. ఆ తర్వాత 1964లో వచ్చిన ‘దూర్ గగన్ కీ చావోన్ మైన్’ సినిమాలోని ‘ఆ చల్‌ కే తుజే మైన్‌ లేకే చలూన్‌’ పాటను ఆమధ్య కేజ్రీవాల్ పాడగా సోషల్ మీడియాలో అది విపరీతంగా వైరల్ అయింది. తాజాగా కేజ్రీవాల్ పాడిన ‘హమ్ హోంగే కామ్యాబ్’ అనేది అమెరికా పౌరహక్కుల ఉద్యమ గీతం. దీనిని ప్రముఖ కవి గిరిజ కుమార్‌ మాథుర్‌ హిందీలోకి అనువదించారు.

  • Loading...

More Telugu News