Chandrayaan: సోమయాన్ పేరును చంద్రయాన్‌గా మార్చిన వాజ్‌పేయి!
- నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ఇస్రో మాజీ చైర్మన్
- అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ఆరితేలాలని వాజ్‌పేయి ఆంకాక్ష
- చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు చేపట్టాలనే దానికి ‘-1’ అని పేరుపెట్టిన వైనం
చంద్రుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఉపగ్రహ ప్రయోగానికి తొలుత అనుకున్న పేరు ‘సోమయాన్’. అప్పటి ప్రధాని వాజ్‌పేయి వద్ద శాస్త్రవేత్తలు ఈ పేరును ప్రస్తావించగా ఆయన దానిని తిరస్కరించారు. సంస్కృత పండితులతో మాట్లాడి ‘చంద్రయాన్’గా నామకరణం చేశారు. అయితే, భారత్ మరిన్ని ప్రయోగాలు చేపట్టి అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోవాలని భావించిన వాజ్‌పేయి ఈ ప్రయోగానికి ‘చంద్రయాన్-1’గా నామకరణం చేశారు. ఈ ప్రాజెక్టు వివరాలను 2003 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో వాజ్‌పేయి ఎర్రకోటపై నుంచి వెల్లడించారు.
వాజ్‌పేయి మరణానంతరం ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయితో కలిసి నాలుగేళ్లు పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు. వాజ్‌పేయి తన మనసును హత్తుకున్న నేత అని పేర్కొన్న ఆయన సహచరులు, జూనియర్లతో ఆయనతో వ్యవహరించే విధానం తనను ఆకట్టుకుందని తెలిపారు. తాను 59వ ఏట రైటర్ అవుతున్నట్టు ఆయనకు లేఖ రాస్తే.. మీరింకా యువకులే.. బాగా పనిచేస్తున్నారని చెబుతూ 62 ఏళ్ల వరకు కొనసాగాలని ఆదేశించారని చెబుతూ కస్తూరి రంగన్ భావోద్వేగానికి గురయ్యారు.