yerapatineni: యరపతినేనికి క్లీన్ చిట్ ఇవ్వడానికే సీఐడితో విచారణ జరిపిస్తున్నారు: కాసు మహేశ్ రెడ్డి ఆరోపణ
- సీబీఐతో జరిపించాల్సిన విచారణను సీఐడీతోనా?
- టీడీపీకి సీఐడీ తోక సంస్థ
- రూ.500 కోట్లు దోచుకున్న స్కామ్ ఇది
- సీబీఐతో విచారణ చేయించాలి
అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ పై సీబీసీఐడి విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుడు కాసు మహేశ్ రెడ్డి స్పందిస్తూ, ఈ వ్యవహారంపై సీబీఐతో జరిపించాల్సిన విచారణను సీబీసీఐడీతో జరిపించడమేమిటని ప్రశ్నించారు.
అక్రమాల ఘనుడు యరపతినేనికి క్లీన్ చిట్ ఇవ్వడానికే సీబీసీఐడితో విచారణ జరిపిస్తోందని ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. టీడీపీకి సీఐడీ తోక సంస్థ అని, ఏపీలో ఏ ఎమ్మెల్యేనైనా విచారించిన ఘనత సీబీసీఐడీకి ఉందా? అని ప్రశ్నించారు. రూ.500 కోట్లు దోచుకున్న ఈ కుంభకోణాన్ని సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.