Tweets: ట్వీట్లు వద్దు.. సాయం చేయండి!: ప్రముఖులకు నెటిజన్ల సలహా

  • కేరళకు తక్షణ సాయం అందించాలని సూచన  
  • ట్వీట్లతో సానుభూతి వద్దన్న అభిమానులు 
  • సెలెబ్రిటీలపై నెటిజన్ల ఆగ్రహం

'వరదలతో నిరాశ్రయులైన కేరళ ప్రజలకు సానుభూతి వద్దు, సాయం ప్రకటించండి' అంటూ సెలబ్రిటీలపై మండిపడుతున్నారు నెటిజన్లు. కేరళ వరద బాధితులకు సాయం అందించకుండా ట్వీట్లతో సరిపెడుతున్న వారిని ట్విట్టర్ వేదికగా తిట్టిపోస్తున్నారు. ట్వీట్ లేనా... సాయం చెయ్యరా? అంటూ నిలదీస్తున్నారు. బాలీవుడ్‌ నటులు వివేక్‌ ఓబెరాయ్‌, అనుష్కశర్మ, అభిషేక్‌ బచ్చన్‌, అమితాబ్‌ బచ్చన్‌లు, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ చెత్రీలు తాము ఏమాత్రం ఆర్ధిక సాయం చేయకుండా, కేవలం ట్వీట్లతో సానుభూతి తెలుపుతూ, తమ అభిమానులను సాయం చేయమంటూ కోరారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు వీరిపై మండిపడ్డారు.

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన ట్వీట్‌కు బదులుగా , ‘వరదలతో కమ్యూనికేషన్‌ దెబ్బతిన్న కేరళలో మీ ట్వీట్స్‌ చదివే పరిస్థితి కూడా లేదు. దయచేసి ట్వీట్స్‌ కాకుండా విరాళాలు ప్రకటించండి’ అంటూ ఓ నెటిజన్ చురక అంటించాడు. అమితాబ్‌ ట్వీట్‌కు ఒకరు స్పందిస్తూ, ‘నేను పేదవాడిని కాబట్టి సాయం చేయలేను.. నల్లధనం సంపాదించిన పెద్దలు సాయం చేయవచ్చని’ ఘాటుగా బదులిచ్చాడు.  

  • Loading...

More Telugu News