Hyderabad: మందేసి వస్తూ డ్రంకెన్ డ్రైవ్ తప్పించుకున్నాడు కానీ... ఆసుపత్రి పాలయ్యాడు!

  • హైదరాబాద్ లో ఘటన
  • బండిని ఆపేసి స్నేహితుడిని పిలిపించుకున్న సిద్ధార్థ్  
  • రోడ్డు దాటే క్రమంలో పట్టుతప్పగా, విరిగిన కాలు

స్నేహితులతో కలసి పబ్బుకెళ్లి పూటుగా మందేశాడు. ఆపై తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుంటే, దూరంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరుపుతున్న పోలీసులు కనిపించగానే అలర్ట్ అయ్యాడు. బండిని పక్కనే ఆపేశాడు. నడుస్తూ ముందుకు వెళ్లాడు. తన స్నేహితుడిని పిలిచాడు. అతను వచ్చే వరకూ కాసేపు అటూ ఇటూ తిరిగాడు. ఫ్రెండ్ వచ్చిన తరువాత పార్క్ చేసిన బండి దగ్గరకు వెళుతున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో కాలును విరగ్గొట్టుకున్నాడు.

మందేసి వస్తూ డ్రంకెన్ డ్రైవ్ ను తప్పించుకున్నాడుగానీ, మరోలా నష్టపోయాడీ ఇంజనీరింగ్ స్టూడెంట్. హైదరాబాద్, సనత్ నగర్ కు చెందినర సిద్ధార్థ్, తన స్కూటీపై జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 మీదుగా వస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. రోడ్డును దాటే క్రమంలో డివైడర్ ఎక్కి, దిగుతున్న వేళ పట్టుతప్పి కిందపడి కాలును విరగ్గొట్టుకున్నాడు. పోలీసులు అతన్ని గమనించి, విచారించగా, అసలు విషయం చెప్పాడు. స్పందించిన పోలీసులు అంబులెన్స్ ను పిలిపించి, అతనిని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News