kcr: వాన దేవుడు కూడా టీఆర్ఎస్ లో చేరాడు..‘కాంగ్రెస్’ కు బుద్ధిచెప్పాడు: మంత్రి హరీశ్ రావు సెటైర్లు
- ఎస్సారెస్పీలోకి 2,50,000 క్యూసెక్కుల వరద నీరు
- రైతులు ఆనందిస్తుంటే ‘కాంగ్రెస్’ ఏడుస్తోంది
- వానదేవుడు తెలంగాణను ఆశీర్వదించాడు
నిజామాబాద్ రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకున్న కాంగ్రెస్ నేతలకు వరుణుడు బుద్ధి చెప్పాడని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో పాడిపశువుల పంపిణీపై అవగానా సదస్సు ఈరోజు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ, భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి 2,50,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని అన్నారు.
కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాల్వలు, గుత్ప, అలీసాగర్ ప్రాజెక్ట్ కు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. రైతులందరూ ఆనందిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడుస్తున్నారని విమర్శించారు. వాన దేవుడు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరాడని, పుష్కలంగా వర్షాలు కురిపించి తెలంగాణను ఆశీర్విదించాడని సంతోషం వ్యక్తం చేశారు. పాడి రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, సీఎం కేసీఆర్ అడగకుండానే రైతులకు అన్నీ చేస్తున్నారని అన్నారు.