kirak rp: చార్జీల కోసం తెలిసినవాళ్ల ఇళ్లలోని పాత పేపర్లను అమ్ముకున్నాను: కిరాక్ ఆర్పీ
- డబ్బులు లేక నడిచేవాడిని
- తెలిసిన వాళ్లింటికి వెళ్లేవాడిని
- ఏనాడూ ఫీల్ కాలేదు
'జబర్దస్త్' కామెడీ షో కారణంగా ఆర్పీ అనే నటుడు అందరికీ తెలిశాడు. తనదైన శైలిలో స్కిట్లు చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను పడిన కష్టాలను గురించి చెప్పాడు. "నేను ఈ స్థాయికి రావడానికి ముందు ఎన్నో ఇబ్బందులు పడ్డాను .. కష్టాలను అనుభవించాను. అయినా ఏ రోజున కూడా ఎవరినీ ఆర్ధిక సాయం అడగలేదు.
నేనున్న చోటు నుంచి కృష్ణానగర్ కి రావడానికి 15 కిలోమీటర్లు నడిచేవాడిని. ఫిల్మ్ నగర్ కి గానీ .. మధురానగర్ కి గాని .. కృష్ణానగర్ కి గాని ఇలా ఎక్కువ దూరం నడవాల్సి వచ్చినప్పుడు తెలిసినవాళ్ల ఇంటికి వెళ్లేవాడిని. వాళ్ల ఇళ్లలో వుండే పాత పేపర్లను .. పుస్తకాలను .. పాత సీసాలను భుజంపై మోసుకుంటూ తీసుకెళ్లి అమ్మేవాడిని. ఎవరింటికి వెళ్లినా నేను ఇదే పని చేసేవాడిని .. వాటిని అమ్మేయగా వచ్చిన డబ్బులు దగ్గర పెట్టుకునేవాడిని. నేనేం తప్పుపని చేయలేదు కనుక బాధపడలేదు .. అలా చేసిన కారణంగా ఆర్ధికంగా ఇబ్బంది పడలేదు" అని చెప్పుకొచ్చాడు.