bandla ganesh: బండ్ల గణేష్ కుటుంబంలో వివాహ వేడుక.. హాజరైన ‘మెగాస్టార్’
- బండ్ల గణేశ్ పెద్ద సోదరుడి కుమార్తె వివాహం
- వధూవరులను ఆశీర్వదించి..అభినందించిన చిరంజీవి
- ఈ వేడుకకు హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబంలో వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. బండ్ల గణేశ్ పెద్ద సోదరుడి కుమార్తె ఆశ్రిత వివాహం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ఈరోజు జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి హాజరై వధూవరులను ఆశీర్వదించి.. అభినందించారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం దంపతులు, శ్రీకాంత్ దంపతులు, రాజశేఖర్ - జీవిత దంపతులు, నటుడు గోపీచంద్ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.