TVS: మార్కెట్లోకి టీవీఎస్ రేడియాన్ బైక్...సరికొత్త ఫీచర్లతో విడుదల!
- లీటర్‌కు 69.3 కిలోమీటర్ల మైలేజీ
- సింక్రనైజ్డు బ్రేకింగ్ టెక్నాజీ
- డిల్లీలో దీని షోరూం ధర 48,400
ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం టీవీఎస్ మోటారు కంపెనీ గురువారం తన నూతన బైక్ మోడల్ ‘టీవీఎస్ రేడియాన్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యంత ఆధునిక సాంకేతికత, సరికొత్త ఫీచర్స్‌తో ఈ బైక్‌ను వినియోగదారుల వద్దకు చేరుస్తున్నట్లు కంపెనీ ఎండీ సుదర్శన్ వేణు విలేకరులకు తెలిపారు.
110 సీసీ సామర్థ్యం ఉన్న ఈ బైక్‌కు సింక్రనైజ్డు బ్రేకింగ్ టెక్నాలజీ, కార్లకు మాత్రమే వినియోగించే స్పీడో మీటరు అనుసంధానించినట్లు తెలిపారు. ప్రీమియం ఫీల్డ్ కంట్రోల్, అతి పెద్ద చక్రాలు, స్మార్ట్‌ఫోన్ చార్జర్ మొదలైనవి అదనపు ఆకర్షణలన్నారు. యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ బైక్‌కు సంబంధించి తొలి ఏడాది లక్షకు పైగా యూనిట్లు విక్రయించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. లీటర్ పెట్రోల్‌కు 69.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని, డిల్లీలో దీని షోరూం ధర 48,400లుగా నిర్ణయించినట్లు తెలిపారు.