Rahul Gandhi: ‘గాంధీ అనే ఇంటిపేరు కారణంగానే కాంగ్రెస్ చీఫ్ అయ్యారు‘ అన్న విమర్శకు స్పందించిన రాహుల్!

  • కుటుంబ నేపథ్యాన్ని పక్కన పెట్టాలన్న రాహుల్
  • వ్యక్తిగత సామర్ధ్యం ఆధారంగా గుర్తించాలని వ్యాఖ్య
  • లండన్ లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ చీఫ్

కాంగ్రెస్ పార్టీ ఓ కుటుంబానికే పరిమితమయిందనీ, దేశాన్ని దశాబ్దాల పాటు ఆ పార్టీనే పరిపాలించిందని మిగతా రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం గాంధీ పేరు కారణంగానే రాహుల్ కు కాంగ్రెస్ అధ్యక్ష పీఠం దక్కిందని విమర్శించేవాళ్లూ ఉన్నారు. ప్రస్తుతం రెండు రోజుల బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు.

ఈ విషయమై లండన్ లో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ రాజకీయ నేపథ్యం నుంచి వచ్చానన్న విషయాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత సామర్థ్యం ఆధారంగానే తనను గుర్తించాలని కోరారు. గాంధీ కుటుంబం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలిస్తూనే ఉందన్న విమర్శలకు స్పందిస్తూ.. మూడు దఫాలుగా తమ కుటుంబంలో ఎవరూ ప్రధాని పీఠాన్ని అధిష్టించలేదని రాహుల్ గుర్తుచేశారు.

‘ముందు మీరు నేను చెప్పేది వినండి. విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం తదితర అంశాలపై నాతో స్వేచ్ఛగా చర్చించండి. మీ ప్రశ్నలు ఏవైనా సరే నా దగ్గరకు తీసుకురండి. ఆ తర్వాత అంతిమంగా నాపై ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకోండి’ అని వ్యాఖ్యానించారు. ఇలా స్వేచ్ఛగా మీడియా, ప్రజలతో మాట్లాడేందుకు ప్రధాని మోదీ తీవ్రంగా ఇబ్బంది పడతారనీ, ప్రశాంతంగా ఆయన కూర్చోలేరని విమర్శించారు. తాను 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాననీ, ఇతరుల మాటలను వింటానని, వారి సిద్ధాంతాలు, ఆలోచనా విధానాలను గౌరవిస్తానని రాహుల్ అన్నారు.

  • Loading...

More Telugu News