sensex: దూసుకు పోయిన మార్కెట్లు.. కొత్త రికార్డులను నెలకొల్పిన సెన్సెక్స్, నిఫ్టీ
- 442 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 11,691కి చేరుకున్న నిఫ్టీ
- దాదాపు 20శాతం లాభపడ్డ అదానీ ట్రాన్స్ మిషన్
భారతీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. అంతర్జాతీయంగా సానుకూలతలకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో... ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు వెనకడుగు వేయలేదు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ ఏకంగా 442 పాయింట్లు పెరిగి 38,694కు ఎగబాకింది. నిఫ్టీ 135 పాయింట్లు లాభపడి 11,691కి చేరుకుంది. తద్వారా సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాల గరిష్ట స్థాయులను తాకాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ (19.98%), షాపర్స్ స్టాప్ (12.44%), మోయిల్ లిమిటెడ్ (9.83%), జిందాల్ సా లిమిటెడ్ (8.14%), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (7.27%).
టాప్ లూజర్స్:
జైప్రకాశ్ అసోసియేట్స్ (-10.05%), ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (-7.67%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-6.37%), జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్ (-5.25%), రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ (-4.99%).