Harikrishna: నందమూరి హరికృష్ణ మృతికి కారణాలివే!
- సొంతంగా కారును నడుపుతున్న హరికృష్ణ
- స్టీరింగ్ కు బలంగా తాకిన ఛాతీ
- బలమైన గాయమై చిట్లిన మెదడు
గంటకు 160 కిలోమీటర్ల వేగంతో స్వయంగా కారును నడుపుతూ ఉండటం నందమూరి హరికృష్ణ మరణానికి కారణమైనట్టు తెలుస్తోంది. ప్రమాదంలో కారు పల్టీలు కొట్టగా, హరికృష్ణ ఛాతీ స్టీరింగ్ కు బలంగా తగిలిందని, ఆపై ఆయన కారులోంచి కిందపడగా, బలమైన గాయమై మెదడు చిట్లిందని కామినేని ఆసుపత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఆసుపత్రికి తీసుకువచ్చేటప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని, అత్యవసర వైద్య చికిత్సలు చేసినా ఆయన ప్రాణాలు నిలబడలేదని, ఉదయం 7:30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారని తెలిపాయి. కాగా, హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఆసుపత్రికి చేరుకున్న తరువాతే, హరికృష్ణ మృతి వార్తను వైద్యులు ప్రకటించారు.