stock market: జీడీపీ డేటా ప్రభావం.. నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్
- ఈరోజు వెలువడనున్న జీడీపీ డేటా
- ఆచితూచి వ్యవహరించిన ఇన్వెస్టర్లు
- 45 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మిక్స్ డ్ గా ట్రేడ్ అయ్యాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి జీడీపీ డేటా ఈరోజు వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 45 పాయింట్లు కోల్పోయి 38,645కి పడిపోయింది. నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 11,680కి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వెల్స్ పన్ ఇండియా (8.87%), హట్సన్ ఆగ్రో ప్రాడక్ట్స్ (8.58%), హెచ్డీఐఎల్ (7.91%), సీసీఎల్ ప్రాడక్ట్స్ ఇండియా (6.76%), జై కార్ప్ (6.08%).
టాప్ లూజర్స్:
వక్రాంగీ (-8.19%), యస్ బ్యాంక్ (-5.11%), కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ (-4.99%), క్వాలిటీ (-4.95%), ఏజీస్ లాజిస్టిక్స్ (-3.50%).