KCR: విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన కేసీఆర్!
- విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ
- హెల్త్ స్కీమ్ అమలు చేస్తామంటూ హామీ
- విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడ్డామన్న సీఎం
తెలంగాణలోని విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. 35 శాతం పీఆర్సీని ఆయన ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఘన విజయం సాధించింది విద్యుత్ రంగమేనని అన్నారు. పొరుగు రాష్ట్రాలకు విద్యుత్ ను అమ్ముకునే స్థాయికి ఎదగాలని చెప్పారు.
విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే విద్యుత్ ఉద్యోగలకు కూడా హెల్త్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం చీకటిమయమవుతుందని చెప్పినవారే... చీకట్లో కలిసిపోయారని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ లో విద్యుత్ ఉద్యోగులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీపి కబురు అందించారు.