South Korea: విధులు నిర్వహిస్తూ పాముకాటుకు బలైన పోలీస్ డాగ్!
- ఉత్తర కొరియా పోలీసులకు సేవలందిస్తున్న శునకం
- 39 మంది నేరస్తులను పట్టించిన డాగ్
- అదృశ్యమైన 170 మందిని కనిపెట్టిన శునకరాజం
చనిపోయిన వ్యక్తిని వెతుకుతూ వెళ్లిన ఓ పోలీస్ డాగ్, పాముకాటుకు గురై మరణించగా, ఆ శునకరాజం చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్న పోలీసులు, దానికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. సౌత్ కొరియా పోలీసులకు 2012 నుంచి సేవలందిస్తున్న జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఓ కుక్క, ఇటీవల చంగ్ చియోంగ్ ప్రావిన్స్ ప్రాంతంలో అదృశ్యమైన వ్యక్తిని వెతుకుతూ వెళ్లి పాముకాటుకు గురైంది. ఇప్పటివరకూ కనిపించకుండా పోయిన 170 మంది ఆచూకీని కనిపెట్టిన ఈ శునకం, 39 మంది నేరస్తులను పట్టించిందట. ఇక దాని సంస్మరణ నిమిత్తం ఓ సభను ఏర్పాటు చేయడంతో పాటు, త్వరలో జరిగే డాగ్ ఫెస్టివల్ లో దీనికి పతకాన్ని ప్రకటించనున్నారు.