TRS: బహిరంగ సభల నిర్వహణలో... తన రికార్డును తానే తిరగరాసుకున్న టీఆర్ఎస్!

  • గతంలో భారీ సభలను విజయవంతం చేసిన టీఆర్ఎస్
  • సింహగర్జన నుంచి మహాగర్జన వరకూ సక్సెస్
  • కొంగరకలాన్ ప్రగతి నివేదన సభ కూడా...

భారీ బహిరంగ సభలను విజయవంతంగా నిర్వహించడంలో ఎంతో చరిత్ర ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, నిన్న కొంగరకలాన్ లో జరిగిన ప్రగతి నివేదన సభనూ అంతే ఉత్సాహంతో పూర్తి చేసి, తన రికార్డును తానే అధిగమించింది. టీఆర్ఎస్ ఆవిర్భవించిన తరువాత జరిగిన బహిరంగ సభలను గమనిస్తే, 2001లో కరీంనగర్ లో నిర్వహించిన 'సింహగర్జన' ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే.

ఆపై 2003లో 'చలో వరంగల్ జైత్రయాత్ర', 2010లో 'మహాగర్జన' నిర్వహించి దాదాపు 15 లక్షల మందికి పైగా ప్రజలను తరలించి, విజయవంతం చేశారు. ఇక తాజాగా, జరిగిన కొంగరకలాన్ సభకు సుమారు 25 లక్షల మందిని తరలిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. అంత మొత్తం ప్రజలు సభా మైదానంలో కనిపించకపోయినా, గత బహిరంగ సభల రికార్డును మాత్రం టీఆర్ఎస్ దాటేసింది. ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన భారీ సభల్లో ఇదే అతిపెద్దదని టీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు.

  • Loading...

More Telugu News