motorola: భారీ బ్యాటరీ బ్యాకప్ తో 'మోటోరోలా పీ30 నోట్' స్మార్ట్‌ఫోన్ విడుదల!
- చైనాలో విడుదలైన పీ30 నోట్
- రెండు వేరియంట్ లలో లభ్యం
- ట్రిపుల్ సిమ్ ట్రే ఏర్పాటు
మోటోరోలా సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ ని తాజాగా చైనాలో లాంచ్ చేసింది. 'మోటోరోలా పీ30 నోట్' పేరిట విడుదలైన ఈ ఫోన్ లో భారీ బ్యాటరీ, ట్రిపుల్ 'సిమ్ ట్రే' ని ఏర్పాటు చేశారు. రెండింటిలో సిమ్ కార్డు, ఒకదానిలో మెమొరీ కార్డు అమర్చడానికి ఈ 'సిమ్ ట్రే' ఉపయోగపడుతుంది. 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లలో లభించే ఈ ఫోన్ మెర్క్యురీ బ్లాక్ రంగులో అందుబాటులోకి రానుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర సుమారుగా రూ.20700 ఉండగా, 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర సుమారుగా రూ.23800గా ఉండే అవకాశం ఉంది.
మోటోరోలా పీ30 నోట్ ప్రత్యేకతలు:
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ (ఫాస్ట్ చార్జింగ్)
- 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
- 6.2" ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
- వెనక భాగంలో రెండు 16/5 మెగాపిక్సల్ కెమెరాలు
- ముందు భాగంలో 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమొరీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే సౌకర్యం)
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
- ఫింగర్‌ప్రింట్ సెన్సార్