Chandrababu: రెండు కోట్ల ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో పని చేయాలి: సీఎం చంద్రబాబు ఆదేశం

  • పెండింగ్ ప్రాజెక్టుల అంశంపై మాట్లాడిన చంద్రబాబు
  • పెండింగ్ లో ఉన్న 57 ప్రాజెక్టులలో 10 పూర్తయ్యాయి
  • ఈ నెల 17 నుంచి వారానికో ప్రాజెక్టును ప్రారంభించాలి

రెండు కోట్ల ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో పని చేయాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పెండింగ్ ప్రాజెక్టుల అంశంపై అమరావతి నుంచి ఆయన మాట్లాడుతూ, ఈ నెల 17 నుంచి వారానికో ప్రాజెక్టును ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు.

 పూర్తయిన ప్రాజెక్టులకు వరుస ప్రారంభోత్సవాలు జరిపేలా కసరత్తులు ప్రారంభించామని, పెండింగ్ లో ఉన్న 57 ప్రాజెక్టులలో 10 పూర్తయ్యాయని, మరో 5 ప్రాజెక్టుల నిర్మాణం తుది దశలో ఉందని అధికారులు తనకు వివరించినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో 47 ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. వంశధార-నాగావళి నదుల అనుసంధానం పనులను ఈ ఏడాది చేపట్టనున్నామని, రాయలసీమలో ఈ ఏడాది 60 శాతం లోటు వర్షపాతం నమోదైందని, అయితే, ప్రభుత్వ చర్యల వల్ల ఇవాళ అన్ని జలాశయాల్లో నీళ్లు ఉన్నాయని, అన్ని జలాశయాల్లో 600 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, దూరదృష్టితో ఆలోచించి సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశామని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News