kcr: అసెంబ్లీ రద్దు తర్వాత.. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ప్రెస్ రిలీజ్ విడుదల!
- అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు
- ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్ ను గవర్నర్ కోరారు
- కేర్ టేకర్ గవర్నమెంట్ ను నడిపించేందుకు కేసీఆర్ అంగీకరించారు
తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాలంటూ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. అనంతరం మీడియాకు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్ ప్రీత్ సింగ్ తరపున ప్రెస్ రిలీజ్ అందింది. ప్రెస్ రిలీజ్ సారాంశం ఇదే.
"తెలంగాణ తొలి అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రవర్గ సహచరులతో కలసి ఈరోజు (6.9.2018) జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ కు సమర్పించారు. కేబినెట్ తీర్మానానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ కేర్ టేకర్ గవర్నమెంట్ ను నడిపించాలని ఈ సందర్భంగా కేసీఆర్ ను గవర్నర్ కోరారు. కేర్ టేకర్ ప్రభుత్వాన్ని నడిపించేందుకు కేసీఆర్ తన అంగీకారాన్ని తెలిపారు"