Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త.. 46,290 ఉద్యోగాలను భర్తీ చేయనున్న ప్రభుత్వం!
- ప్రకటించిన ఆర్థికమంత్రి యనమల
- డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లో భర్తీచేస్తామని వెల్లడి
- వీటిలో ఉపాధ్యాయ, లెక్చరర్ పోస్టులున్నాయని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మంత్రిత్వ శాఖల్లో 46,290 ఉద్యోగ ఖాళీలను గుర్తించినట్లు ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ ఖాళీలన్నింటిని డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ 46,290 ఉద్యోగాల్లో ఉపాధ్యాయ, లెక్చరర్ ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఇప్పటికే వివిధ శాఖల్లో 2,350 పోస్టుల భర్తీకి అనుమతులు జారీచేశామని యనమల తెలిపారు. మరోవైపు శాసనసభ్యుడు చాంద్ బాషా అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి గంటా స్పందిస్తూ.. రాష్ట్రంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని భాషా పండితుల(ఎల్పీ) హోదాను పెంచుతామని తెలిపారు.