hardik patel: హార్దిక్ పటేల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలింపు
- ఆరోగ్యం క్షీణించడంతో పాస్ నేతల నిర్ణయం
- దీక్షను పట్టించుకోని గుజరాత్ ప్రభుత్వం
- కాంగ్రెస్ కనుసన్నల్లోనే ఉద్యమమని ఆరోపణ
గడచిన 14 రోజులుగా దీక్ష చేస్తున్న పటీదార్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో ఆయనను పటీదార్ అనామత్ ఆందోళన సమితి (పాస్) నేతలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పటీదార్లకు రిజర్వేషన్లు, రైతు రుణమాఫీ డిమాండ్లతో రెండు వారాల నుంచి హార్దిక్ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
తన డిమాండ్లపై 24 గంటల్లోగా స్పందించకుంటే మంచినీరు కూడా ముట్టనని హార్దిక్ హెచ్చరించినా గుజారాత్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా ఇది కాంగ్రెస్ కనుసన్నల్లో జరుగుతున్న ఉద్యమమని ఆరోపించింది. కాగా, గుజరాత్ ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి ఏ మాత్రం ఆసక్తి లేదని పాస్ కన్వీనర్ మనోజ్ పనారా ఆరోపించారు.