stock market: కుప్పకూలిన మార్కెట్లు.. 38 వేల దిగువకు సెన్సెక్స్!
- రూపాయి విలువ, పెట్రో ధరల ప్రభావం
- భారీ నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు
- 468 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా డాలరుతో మరింత పతనమైన రూపాయి విలువ, భారీగా పెరుగుతున్న పెట్రో ధరలకు తోడు అమెరికా-చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమయినప్పటి నుంచి మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ ఏకంగా 468 పాయింట్లు కోల్పోయి 37,922కు పడిపోయింది. నిఫ్టీ 151 పాయింట్లు నష్టపోయి 11,438కు దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జిందాల్ స్టెయిన్ లెస్ (8.47%), మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (6.39%), కాఫీ డే (4.97%), ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్ (4.32%), ఈఐడీ ప్యారీ (3.91%).
టాప్ లూజర్స్:
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-13.79%), ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (-6.07%), టోరెంట్ పవర్ (-5.98%), సెంచురీ ప్లైబోర్డ్స్ (-5.63%), ఈక్విటాస్ హోల్డింగ్స్ (-5.09%).