gold: పెరిగిన బంగారం, వెండి ధరలు!
- ప్రియమవుతున్న బంగారం, వెండి ధరలు
- రూపాయి మారకం కనిష్టానికి పడిపోవడంతో పెరిగిన బంగారం ధర
- వ్యాపారుల నుంచి కూడా పెరుగుతున్న గిరాకీ
భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఆ బంగారం రోజురోజుకూ ప్రియమవుతోంది. దీంతో పాటే వెండి ధర కూడా పెరుగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కనిష్టానికి పడిపోవడంతో దిగుమతి చేసుకునే బంగారం ధర పెరిగింది. దీంతో పాటు స్థానిక వ్యాపారుల నుంచి కూడా గిరాకీ ఎక్కువవుతోంది. దీంతో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. నేడు రూ.200 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.31,550కు చేరింది. ఇక వెండి ధర రూ.175 పెరిగి కిలో రూ.37,950కు చేరుకుంది.