sensex: రెండు రోజుల భారీ పతనం తర్వాత.. దూసుకుపోయిన మార్కెట్లు
- ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మెటల్, ఇన్ఫ్రా రంగాల అండ
- 305 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 11,370కి చేరుకున్న నిఫ్టీ
వరుసగా రెండు రోజుల పాటు భారీ నష్టాలను నమోదు చేసిన దేశీయ మార్కెట్లు... ఈ రోజు దూసుకుపోయాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, ఇన్ఫ్రా సూచీలు మార్కెట్లను లాభాల బాట పట్టించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 305 పాయింట్లు ఎగబాకి 37,718కి చేరుకుంది. నిఫ్టీ 82 పాయింట్లు లాభపడి 11,370 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ (6.68%), ఇంటలెక్ట్ డిజైన్ ఎరీనా లిమిటెడ్ (6.65%), ఏబీబీ ఇండియా (5.60%), అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ (5.18%), స్వాన్ ఎనర్జీ (4.78%).
టాప్ లూజర్స్:
గ్రాన్యూల్స్ ఇండియా (-5.73%), బ్యాంక్ ఆఫ్ బరోడా (-5.12%), రాడికో ఖైతాన్ లిమిటెడ్ (-4.85%), రెప్కో హోం ఫైనాన్స్ (-4.69%), వెల్స్ పన్ ఇండియా (-4.44%).