tjs: టీడీపీ, సీపీఐ నేతల చర్చలు సఫలం.. మహాకూటమిలోకి కోదండరామ్ పార్టీ!
- ఎల్ రమణ ఇంట్లో చర్చలు
- ఢిల్లీ పర్యటన బిజీలో హాజరుకాని కాంగ్రెస్ నేతలు
- కాసేపట్లో కోదండరామ్ నుంచి అధికారిక ప్రకటన
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పలు పార్టీలు మహాకూటమి పేరుతో ఒకే గొడుకు కిందకు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల మధ్య చర్చలు జరిగాయి. తాజాగా కోదండరామ్ పార్టీ అయిన టీజేఎస్ తో టీడీపీ, సీపీఐ నేతలు జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఇంట్లో జరిగిన ఈ సమావేశంలో కూటమికి సంబంధించి చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి టీడీపీకి చెందిన పెద్దిరెడ్డి, రావుల కూడా హాజరయ్యారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండటం వల్ల కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు. కాసేపట్లో మహాకూటమిలో చేరే అంశాన్ని కోదండరామ్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.