heart: చిట్టి గుండెకు పెద్ద కష్టం.. శరీరం బయట అభివృద్ధి చెందిన హార్ట్!
- మూడు ఆపరేషన్లు చేసి లోపల అమర్చిన వైద్యులు
- బ్రెస్ట్ బోన్ అభివృద్ధికి మరో ఆపరేషన్‌కు సన్నాహాలు
- యూకేలోని లెస్టర్ నగరంలో చికిత్స
చిట్టిగుండెకు పెద్ద కష్టం వచ్చింది. తల్లి గర్భంలో ఉండగానే ఓ చిన్నారి గుండె శరీరం బయట అభివృద్ధి చెందడాన్ని వైద్యులు గమనించారు. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో బయట గుండె కొట్టుకోవడాన్ని గుర్తించారు. దీంతో ప్రసవం తర్వాత ఇప్పటి వరకు మూడు ఆపరేషన్లు చేసి ఆ గుండెను శరీరం లోపల వైద్యులు అమర్చారు. చాతి భాగానికి ఊతంగా ఓ బేస్ ఏర్పాటు చేశారు. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన వానిలోప్ విల్కిన్స్ అనే చిన్నారికి పుట్టుకతోనే సమస్య ఏర్పడింది. శస్త్రచికిత్స కోసం లెస్టర్ నగరానికి తరలించారు. ఆపరేషన్ల ద్వారా గుండెను శరీరంలో అమర్చారు. బ్రెస్ట్ బోన్ అభివృద్ధి చెందేందుకు మరో ఆపరేషన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.