sensex: కొంచెం బలపడ్డ రూపాయి.. 373 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 145 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 38,091కి చేరుకున్న సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. రూపాయి విలువ కొంచెం బలపడటంతో పాటు, ప్రధాని మోదీ ఆర్థిక సమీక్షను నిర్వహించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 373 పాయింట్లు పెరిగి 38,091కి చేరుకుంది. నిఫ్టీ 145 పాయింట్లు లాభపడి 11,515కు ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బలరాంపూర్ చీనీ మిల్స్ (13.81%), గ్రాన్యూల్స్ ఇండియా (10.17%), రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ (9.15%), యూఫ్లెక్స్ (9.14%), జిందాల్ సా (7.82%).
టాప్ లూజర్స్:
అశోక బిల్డ్ కాన్ (-5.92%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-5.37%), క్వాలిటీ (-4.43%), సియెంట్ లిమిటెడ్ (-3.13%), వెల్స్ పన్ కార్ప్ (-2.94%).