apple: యాపిల్ 'కొరికినట్టు' ఎందుకుంటుంది?: యాపిల్ కంప్యూటర్ లోగో కథా కమామీషు!
- భిన్నంగా కనిపించే కంపెనీ లోగో
- ప్రత్యేక కారణంతోనే ఆవిష్కరణ
- రోబ్ జనోఫ్ దీని రూపకర్త
కంప్యూటర్‌తో పరిచయం ఉన్న వారెవరికీ యాపిల్ కంపెనీ గురించి చెప్పక్కర్లేదు. ఆ కంపెనీ ఉత్పత్తులు ప్రతిదానిపైనా ఓ వైపు కొరికినట్టు ఉండే యాపిల్ గుర్తు ఉండడాన్ని గమనించే ఉంటారు. అవునండి... పెడితే పూర్తి యాపిల్ పెట్టాలిగాని, ఇలా కొరికినట్టుందేమిటి? అనుకుంటున్నారా. దానికీ కారణముందంటున్నారు. 1977లో రోబ్ జనోఫ్ ఈ లోగోను రూపొందించాడు. యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్‌కు దాన్ని చూపించాడు. ఈలోగో జాబ్స్‌కు బాగా నచ్చింది. ఎందుకంటే కంపెనీ పెట్టక ముందు జాబ్స్‌కు యాపిల్ తోట ఉండేది. అక్కడే ఎక్కువకాలం గడిపేవాడు. అందుకే కంపెనీకి యాపిల్ అని పేరు పెట్టాడు. లోగో కూడా అదే కావడంతో అతను ఇష్టపడ్డాడని సమాచారం.
ఇక, లోగో సృష్టికర్త జనోఫ్ అలా రూపొందించడానికి ఓ కారణం ఉందట. కంప్యూటర్ సైన్స్ పండితుడైన ఎలన్ టర్నింగ్ మహనీయుడు 1954లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతని మృతదేహం పక్కన సగం కొరికిన విషంతో నిండిన యాపిల్ పండు దొరికింది. టర్నింగ్ దాన్ని తిన్నాడని తెలిసింది. టర్నింగ్ కొరికినప్పటికీ యాపిల్ తాజాగానే ఉంది. కాస్త కొరికినా యాపిల్ స్వరూపం మారిపోదని గుర్తించినందునే జనోఫ్ కంపెనీ లోగోను అలా రూపొందించాడంటారు. మొత్తం మీద లోగో సృష్టికర్త జనోఫ్, కంపెనీ యజమాని స్టీవ్‌జాబ్స్ అభిప్రాయాలు కలవడంతో యాపిల్ లోగో ఆవిష్కృతమైంది. ప్రపంచంలో ప్రముఖ కంపెనీగా వెలుగొందుతోంది.