kcr: కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణకు అవసరమా?: కోదండరామ్
- పరిపాలించడం చేతకాకే.. నాలుగేళ్లకే దిగిపోయారు
- 4.36 లక్షల ఓట్లను తొలగించి ఎన్నికలకు ఎలా వెళ్తారు?
- కుటుంబ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిద్దాం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీజేఎస్ పార్టీ అధినేత కోదండరామ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏనాడూ ప్రజలను కలవరని, ప్రజా సమస్యలను తెలుసుకోరని, అలాంటి నాయకుడు తెలంగాణకు అవసరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రులంతా ఉత్సవ విగ్రహాలేనని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో 4.36 లక్షల ఓట్లను తొలగించి ఎన్నికలకు వెళ్తున్నారని, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించారని మండిపడ్డారు. ఓటర్ల నమోదు గడువును పెంచాలని డిమాండ్ చేశారు. పరిపాలించడం చేతగాకే... నాలుగేళ్లకే కేసీఆర్ దిగిపోయారని అన్నారు. ప్రత్యర్థులను కేసుల్లో ఇరికించి, ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ యత్నిస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ పాలన, నిరంకుశ పాలన, గడీల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దామని పిలుపునిచ్చారు.