Tirumala: తిరుమలలో రాత్రి నుంచి ఆగని వర్షం... లక్షలాది మందికి తీవ్ర ఇబ్బందులు!
- నేడు బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం
- గరుడోత్సవానికి తరలివస్తున్న భక్తులు
- గదులు లభించక వర్షంలో ఇబ్బందులు
తిరుమల సప్తగిరులు భారీ వర్షంతో తడిసి ముద్దవుతుంటే, సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చిన లక్షలాది మంది భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత రాత్రి నుంచి తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. నేడు బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన గరుడోత్సవం జరుగనుండగా, దేవదేవుని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు రోడ్లపై నీటిలో తడవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
గరుడోత్సవంకి వచ్చే డోనర్ల కోసం సామాన్యులకు గదుల కేటాయింపును టీటీడీ రద్దు చేయడంతో, తిరుమలకు వచ్చిన సామాన్య భక్తులు ఆందోళన చేస్తున్నారు. పిల్లా పాపలతో వచ్చి షెడ్లు, యాత్రికుల వసతి సముదాయాల కారిడార్లలో తలదాచుకున్న వేలాది మంది వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు.