TTD: టీటీడీపై సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- హైకోర్టును ఆశ్రయించాలని సూచన
- దేవస్థానం పాలనా వ్యవహారాలపై ఎంపీ పిటిషన్ దాఖలు
- కోట్ల రూపాయల ఆదాయానికి ఆడిటింగ్ సరిగాలేదని ఆరోపణ
తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా వ్యవహారాలపై ఆరోపణలు చేస్తూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది స్థానిక అంశం అయినందున హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. టీటీడీకి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా ఇందుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై ఆడిటింగ్ సరిగా జరగడం లేదని, పారదర్శకత ఉండడం లేదని ఆరోపిస్తూ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. తన ఆరోపణలపై విచారణ జరిపించాలని వాదించారు. దీన్ని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ ను తిరస్కరిస్తూ హైకోర్టుకు వెళ్లమని సూచించింది.