elephant: ఉత్తరాఖండ్ అడవుల్లో ఏనుగును చంపి.. దంతాల చోరీ!
- పునరావృతమైన 2001నాటి ఘటన
- మృతి చెందిన ఏనుగుకు పోస్టుమార్టం
- నివేదిక ఆధారంగా దర్యాప్తు
ఏనుగును చంపి దంతాలను చోరీ చేసిన ఘటన ఉత్తరాఖండ్‌లో సంచలనం రేపుతోంది. 2001లో కూడా ఇక్కడి అటవీ ప్రాంతంలో ఇటువంటి వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. మళ్లీ ఇన్నేళ్ల తరువాత అలాంటి ఘటనే పునరావృతమైంది.
ఉత్తరాఖండ్‌లోని శివాలిక్ అటవీ ప్రాంతంలో కొందరు దుండగులు 45 ఏళ్ల మగ ఏనుగును చంపి, దాని దంతాలను ఎత్తుకుపోయారు. ఈ విషయాన్ని డెహ్రాడూన్ అటవీశాఖాధికారి ధర్మసింగ్ మీణా స్వయంగా వెల్లడించారు. ఈ ఘటనలో మృతి చెందిన ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక ఆధారంగా అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు.