ap: కేంద్రం అన్యాయంపై ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం.. తీర్మానంలో ఏముందంటే..!

  • కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది
  • మోదీ ప్రభుత్వ ధోరణి.. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం
  • అన్ని హామీలను సంపూర్ణంగా అమలు చేయాలి

ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని భవిష్యత్తు తరాల ప్రజలు కూడా క్షమించరని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ రోజు ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదా, రాష్ట్ర పునర్విభజన చట్టంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఇదే...

"విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను, అధికారులను కలసి సంప్రదింపులు జరిపినా... వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా... కేంద్ర ప్రభుత్వం తన తీరును మార్చుకోకుండా మొండిగా వ్యవహరించడాన్ని శాసనసభ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వచ్చని 14వ ఆర్థిక సంఘం చెప్పినప్పుడు... ప్రస్తుతం హోదా లబ్ధిని పొందుతున్న 11 రాష్ట్రాలకు ఆ ప్రయోజనాలను కొనసాగిస్తున్నప్పుడు... ఏపీకి మాత్రం ఆ హామీని ఎందుకు నెరవేర్చరు? ఏపీ పట్ల మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని సభ అభిప్రాయపడుతోంది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలతో పాటు, చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని శాసనసభ డిమాండ్ చేస్తోంది. ఈ హామీలను నెరవేర్చడం ద్వారా పార్లమెంటు వ్యవస్థ గొప్పదనాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం"

  • Loading...

More Telugu News