Low Preasure: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • నేడు వాయుగుండంగా మారే అవకాశం
  • హెచ్చరించిన వాతావరణ శాఖ

వచ్చే రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, మరింత బలపడింది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి, నేటి సాయంత్రానికి వాయుగుండంగా మారుతుందని అధికారులు వెల్లడించారు.

ఆ వెంటనే ఇది తీవ్ర వాయుగుండంగా మరే అవకాశలున్నాయని తెలిపారు. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల మధ్యగా ప్రయాణిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తా అంతటా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ వాయుగుండం శుక్రవారం రాత్రి కళింగపట్నం - పూరీ మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి 60 కిలోమీటర్ల వరకూ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.

  • Loading...

More Telugu News