Gujarath: స్టే ఎత్తివేయాలంటూ కోరిన అమిత్ షా కొడుకు జై షా.. తిరస్కరించిన సుప్రీం కోర్టు
- పరువు నష్టం దావాపై స్టే ఎత్తివేతకు నిరాకరణ
- ఈనెల 26వ తేదీ వరకు స్టే పొడిగింపు
- కేసు విచారణ త్వరగా జరిగేలా చూడాలని కోరిన పిటిషనర్ తరపు న్యాయవాది
తాను వేసిన పరువు నష్టం దావా విచారణపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ బీజేపీ చీఫ్ అమిత్ షా కొడుకు జై షా వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తన పరువుకు భంగం కలిగేలా కథనాన్ని ప్రచురించారని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జై షా ‘ద వైర్’ అనే వెబ్ పత్రికపైనా, సంబంధిత విలేకరి పైనా దావా వేశారు. అయితే, దీనిపై విచారణను నిలుపుదల చేస్తూ సుప్రీం గతంలో స్టే విధించింది.
ఈ స్టేను ఎత్తివేసి, తక్షణం కేసు విచారణ జరిగేలా చూడాలి’ అంటూ పిటిషనర్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీం న్యాయమూర్తుల దృష్టికి తీసుకువచ్చారు. పిటిషన్ పరిశీలించిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని తిస్రభ్య ధర్మాసనం స్టే ఎత్తివేతకు నిరాకరించింది. పైగా గురువారంతో ముగిసిన స్టేని ఈనె 26 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.