aaraku: అరకులో మావోయిస్టుల దాడి ఘటనతో ఏపీలో అప్రమత్తం!
- గ్రామదర్శినిలో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు జాగ్రత్త
- పర్యటనల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా
- ముఖ్యమంత్రి కార్యాలయం సూచన
విశాఖపట్టణం జిల్లాలోని అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనతో ఏపీలో అప్రమత్తత నెలకొంది. పలు జిల్లాల్లో గ్రామదర్శినిలో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, పర్యటనల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) సూచించింది. ఇదిలా ఉండగా, దాడి చేసిన మావోయిస్టుల బృందంలో మొత్తం అరవై మంది ఉండగా, అందులో నలభై మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనకు ముందు కిడారి సర్వేశ్వరరావుతో దాదాపు గంట సేపు మావోయిస్టులు మాట్లాడినట్టు తెలుస్తోంది.