araku: అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై సోమ అనుచరుల దాడి

  • డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ ధ్వంసం 
  • కానిస్టేబుళ్లకు గాయాలు
  • డుంబ్రిగూడ ఎస్ఐ నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగింది

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి అనుచరులు, బంధువులు, స్థానికులు మండిపడుతున్నారు. అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై దాడి చేశారు. డుంబ్రిగూడ ఎస్ఐ నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఔట్ పోస్ట్ ను తగలబెట్టారు. పోలీస్ స్టేషన్ లో ఫర్నీచర్ ధ్వంసం కాగా, కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. 

  • Loading...

More Telugu News