Uttam Kumar Reddy: 60 రోజులు శ్రమిస్తే అధికారం మనదే... 3 గంటల సుదీర్ఘ ప్రసంగంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • నిర్లక్ష్యం చేయకుండా కార్యకర్తలు కృషి చేయాలి
  • అక్టోబర్ లో నోటిఫికేషన్, నవంబర్ లో ఎన్నికలు
  • ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన ఉత్తమ్

మరో రెండు నెలలు శ్రమిస్తే, తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీదేనని, ఇటువంటి అత్యంత కీలక సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేతలు, కార్యకర్తలు కష్టపడాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫేస్ బుక్ లైవ్ ద్వారా సుమారు లక్షమందిని ఉద్దేశించి 3 గంటల పాటు ప్రసంగించిన ఆయన, కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి మూలస్తంభాలని, రాష్ట్రంలో పార్టీ ఓ బలమైన శక్తని అన్నారు. తనకున్న సమాచారం మేరకు అక్టోబర్ లో నోటిఫికేషన్, నవంబర్ నెలాఖరులో ఎన్నికలు రానున్నాయని చెప్పిన ఆయన, డిసెంబర్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు.

కొత్త ఓటర్ల నమోదు, మార్పు చేర్పులకు 25వ తేదీ ఆఖరని గుర్తు చేసిన ఆయన, ప్రతి కార్యకర్తా ఓటర్ జాబితాలను పరిశీలించి, పేర్లు లేనివారిని నమోదు చేయించాలని, ఈవీఎంల పరిశీలనా కార్యక్రమంలో పాల్గొని అనుమానాలను అక్కడే నివృత్తి చేసుకోవాలని సూచించారు. వందలాది మంది యువకుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమేనని, ఆయన ప్రగతి భవన్ కు మాత్రమే పరిమితమయ్యారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News