giriraj singh: పేరు మార్చుకున్న కేంద్ర మంత్రి గిరిరాజ్
- తన పేరు ముందు గోత్రాన్ని చేర్చుకున్న గిరిరాజ్
- ఇకపై శాండిల్య గిరిరాజ్ సింగ్ గా మారనున్న పేరు
- సనాతనులందరూ పేరులో గోత్రాన్ని చేర్చుకోవాలంటూ పిలుపు
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత గిరాజ్ సింగ్ తన పేరును మార్చుకున్నారు. తన పేరుకు ముందు గోత్రాన్ని కూడా కలుపుకుంటున్నట్టు ఆయన తెలిపారు. దీంతో, ఆయన పేరు ఇకపై శాండిల్య గిరిరాజ్ సింగ్ గా మారనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని హిందువులంతా సనాతన ధర్మాన్ని ఆచరించాలని పిలుపునిచ్చారు.
దేశాన్ని కాపాడాలంటే సనాతన ధర్మాన్ని హిందువులంతా ఆచరించాల్సిందేనని చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడటానికి మహర్షులు చూపిన బాటలో పయనించాల్సిన అవసరం ఉందని అన్నారు. మనంతట మనమే ఎవరి గోత్రాలను వారు పేరు ముందు చేర్చుకోవాలని సూచించారు. సనాతనులందరూ తమ పేరులో గోత్రాన్ని చేర్చుకోవాలని కోరుతున్నానంటూ గిరిరాజ్ ట్వీట్ చేశారు.