sensex: ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 109 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 11,053కు పడిపోయిన నిఫ్టీ
- నష్టాలను మూటగట్టుకున్న టీసీఎస్, విప్రో, టాటా మోటార్స్
నిన్న లాభాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఐటీ, కన్జ్యూమర్ గూడ్స్ స్టాకులు మార్కెట్లను నష్టాల్లోకి లాగాయి. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ వెలువడనుండటంతో... ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 36,542కు పడిపోయింది. నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 11,053 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (11.69), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (10.72), సెంట్రమ్ క్యాపిటల్ (7.10), ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (6.91), హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ (6.48).
టాప్ లూజర్స్:
కేపీఐటీ టెక్నాలజీస్ (7.37), వా టెక్ వాబాగ్ (6.84), బలరాంపూర్ చీనీ మిల్స్ (5.65), పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ (5.27), క్వాలిటీ (4.85). టీసీఎస్, మారుతి, ఐటీసీ, విప్రో, టాటా మోటార్స్ తదితర కంపెనీలు కూడా నష్టపోయాయి.