Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితంలో అరుదైన రికార్డు!
- నేటితో చంద్రబాబు పుట్టి 25 వేల రోజులు
- సరిగ్గా సగం రోజులు శాసనసభ్యుడిగానే గడిపిన వైనం
- 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జీవితంలోకి అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఆయన తన జీవితంలో సరిగ్గా సగం రోజులు చట్ట సభల్లోనే గడిపారు. 20 ఏప్రిల్ 1950లో చంద్రబాబు జన్మించారు. అంటే నేటితో ఆయన పుట్టి 25 వేల రోజులు అవుతుందన్నమాట. ఇందులో సరిగ్గా సగం రోజులు అంటే 12,500 రోజులు శాసనసభ్యుడిగా పనిచేశారు. అలాగే, ముఖ్యమంత్రిగా నేటితో ఆయన 4,753 రోజులు పూర్తి చేసుకోనున్నారు.
28 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు దేశంలోని ప్రస్తుతం ఉన్న సీనియర్ నేతల్లో ఒకరు. 1978లో తొలిసారి ఆయన శాసన సభకు ఎన్నికయ్యారు. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన వ్యక్తి అప్పట్లో చంద్రబాబే. అంతేకాదు, అతి చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగానూ చంద్రబాబు పేరిట మరో రికార్డు ఉంది.