Pakistan: మన కంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో పెట్రోల్ చీప్!: కేంద్రంపై సిద్ధూ ఫైర్
- పెట్రో ధరలు మనకంటే పాక్, బంగ్లాదేశ్ లలో తక్కువగా ఉన్నాయి
- చమురు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం లబ్ధిని చేకూర్చుతోంది
- ముంబైలో రూ. 90 దాటిన లీటర్ పెట్రోల్ ధర
ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండటంపై మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మండిపడ్డారు. పెట్రోల్ ధరలు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో మనకంటే తక్కువగా ఉన్నాయని చెప్పారు. పెట్రో ఉత్పత్తులపై పన్నులను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం... చమురు కంపెనీలకు లాభాలను అందిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది ఒకటని, చేస్తున్నది మరొకటని అన్నారు. గత కొన్ని వారాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ముంబై లో లీటర్ పెట్రోల్ ధర రూ. 90 దాటింది. పెరుగుతున్న పెట్రో ధరలపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా... విపక్షాలు విమర్శలను ఎక్కుపెడుతున్నాయి.