deepthi: కౌశల్ మీద నాకు ఎలాంటి కక్ష లేదు: దీప్తి నల్లమోతు
- నా ఎమోషన్స్ ను బిగ్ బాస్ మీ ముందుంచారు
- ఫైటింగ్ స్పిరిట్ ను చూపించారు
- ఈ అభిమానం మరిచిపోలేనిది
న్యూస్ యాంకర్ గా దీప్తి నల్లమోతు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. 'బిగ్ బాస్ 2' షోలో ఆమె పాల్గొన్న దగ్గర నుంచి మరింతగా క్రేజ్ పెరిగింది. ఈ షోలో అయిదుగురు ఫైనలిస్టుల్లో 4వ స్థానంలో దీప్తి నల్లమోతు నిలిచింది. అయితే ఈ షోలో ఆమె ఫైటింగ్ స్పిరిట్ చూసి అంతా కూడా సెకండ్ ప్లేస్ ఆమెదే అనుకున్నారు. కానీ అలా జరగకపోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
తాజాగా ఆమె అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించగా, అభిమానులంతా ప్రశ్నల వర్షం కురిపించారు. వాటన్నింటికి ఆమె స్పందిస్తూ .. "బిగ్ బాస్ 2' షోలో పాల్గొనడం నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం .. మీ అందరి మనసులు గెలుచుకోవడం నేను గర్వపడేలా చేసిన విషయం. నాని ఈ షోను చాలా అద్భుతంగా నడిపించారు. 'బిగ్ బాస్' నా ఎమోషన్స్ ను .. ఫైటింగ్ స్పిరిట్ చూపించిన తీరే నన్ను మీకు దగ్గర చేసిందని భావిస్తున్నాను.
నేను హీరోయిన్ గా ట్రై చేయాలని అనడం మీ అభిమానానికి నిదర్శనం. కానీ నాకు అలాంటి ఆలోచనేం లేదు. ఇక కౌశల్ తో నేను ముందు మంచిగా వుండి .. ఆ తరువాత వ్యతిరేకించాననడంలో నిజం లేదు. కొన్ని రకాల గేమ్స్ జరుగుతున్నప్పుడు .. ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఉండాల్సి వస్తుంది. పరిస్థితులను బట్టి అలా వ్యవహరించానే తప్ప, కౌశల్ పై నాకు ఎలాంటి కక్ష లేదు" అని ఆమె స్పష్టం చేశారు.